---Advertisement---

Toxic Release Date: యష్ ‘టాక్సిక్’కు ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మళ్లీ వాయిదా లేదా?

June 21, 2026

Summarize with AI

---Advertisement---

‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్'(Toxic) విడుదల తేదీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను చివరకు 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల(Release) చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

వాస్తవానికి ఈ సినిమా 2026 మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 4న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ఆ తేదీ కూడా సాధ్యపడలేదు. దీంతో ఈ ఏడాది సినిమా విడుదల కాదని, 2027 సంక్రాంతికి వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ చిత్ర బృందం కొత్త విడుదల తేదీని(Release Date) ప్రకటించింది.

ఆగస్టు 26 బుధవారం రోజున సినిమాను విడుదల చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పెద్ద సినిమాలు శుక్రవారం లేదా గురువారం విడుదలవుతుంటాయి. అయితే యష్(Yash) మాత్రం భిన్నంగా బుధవారం తేదీని ఎంచుకోవడం వెనుక వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. వరుసగా వచ్చే సెలవులు, వారాంతాన్ని దృష్టిలో పెట్టుకుని తొలి 5 రోజుల కలెక్షన్లను గరిష్ఠంగా సాధించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఇప్పటికే 2 సార్లు విడుదల వాయిదా పడటంతో సినిమాపై ఉన్న ప్రారంభ హైప్ కొంత మేర తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడుదల తేదీ సమీపించే కొద్దీ టీజర్(Teaser), ట్రైలర్(Trailer), ప్రచార కార్యక్రమాలతో మళ్లీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయనున్నారు.

1980ల నాటి గోవా నేపథ్యంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. యష్ సరసన కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇక ‘టాక్సిక్’తో పాటు యష్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్న ఆయన పాత్రపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment