---Advertisement---

‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు.!

August 23, 2026

Summarize with AI

---Advertisement---

పాన్-ఇండియా స్టార్ యష్(Yash) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’(Toxic: A Fairy Tale for Grown-Ups). మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University) ప్రాంగణంలో శనివారం రాత్రి ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను (Pre-Release Event)‌ భారీగా నిర్వహించారు. యష్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది విద్యార్థులు(Students), అభిమానులు(Fans) తరలిరావడంతో ప్రాంగణం సందడిగా మారింది.

అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. యష్‌ను చూసేందుకు కొందరు విద్యార్థులు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సౌండ్ బాక్స్‌లు(Sound Boxes), ఫ్లడ్ లైట్ (Flood Light) నిర్మాణాలపైకి ఎక్కారు. ఒక్కసారిగా విద్యార్థుల బరువు పెరగడంతో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ఫ్రేమ్ కుప్పకూలింది.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో వెంటనే పోలీసులు స్పందించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉండటం, విద్యార్థులు ప్రమాదకరంగా సౌండ్ బాక్స్‌లపైకి ఎక్కడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే యష్ తన ప్రసంగాన్ని నిలిపివేసి, గాయపడిన విద్యార్థులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని నిర్వాహకులకు సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment