---Advertisement---

రహదారి కోసం అర్ధనగ్న పోరాటం.. గిరిజనుల ఆవేదనకు పాలకుల స్పందన ఎప్పుడూ?

September 1, 2026

Summarize with AI

---Advertisement---

కనీస రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జరడ పంచాయతీ పరిధిలోని గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఏళ్లుగా తమ గ్రామాలకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జరడ, గెడ్డగూడ, ములుగూడ, గుమ్మిడిగూడ, పొడిదాం, పట్టాయిగెడ్డ, కంబమానుగూడ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని గిరిజనులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని, గ్రామాల మధ్య రాకపోకలు కూడా అత్యంత కష్టతరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గర్భిణులు, వృద్ధులు అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. కనీస మౌలిక సదుపాయమైన రహదారి కోసం ఎన్నిసార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతోనే వినూత్న రీతిలో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నారు.

గతంలో పీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గిరిజనులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఆయా గ్రామాలకు రహదారి మంజూరు చేసి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment