---Advertisement---

డోలీలోనే గిరిజనుల దారి.. పవన్‌ ‘రోడ్ల అభివృద్ధి’ ప్రచారానికి మన్యంలో కనిపిస్తున్న అసలు చిత్రం!

October 4, 2026

Summarize with AI

---Advertisement---

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల (Tribals) కష్టాలు ఇంకా తీరడం లేదు. గూడెం కొత్తవీధి మండలం అమ్మవారి ధారకొండ పంచాయతీ తడకపల్లికి చెందిన నిండు గర్భిణి (Pregnant Woman) కొర్రా దామినికి గురువారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీసం బైక్‌ కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో రాత్రంతా గ్రామంలోనే ఉండిపోయిన ఆమెను శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలీలో(Doli) కట్టుకుని సుమారు 8 కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు, వాగులు దాటిస్తూ శ్యామగెడ్డ వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో చింతపల్లి సామాజిక ఆస్పత్రికి (Chintapalli Community Hospital) తరలించగా, దామిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న దుస్థితికి ఇది మరో ఉదాహరణ. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని, ముఖ్యంగా గర్భిణులను డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. వర్షాకాలంలో వాగులు, కొండదారులు మరింత ప్రమాదకరంగా మారడంతో ఈ కష్టాలు రెట్టింపవుతున్నాయి.

ఇటీవల ఇదే గూడెం కొత్తవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామంలో ప్రసవం అనంతరం అస్వస్థతకు గురైన 28 ఏళ్ల గిరిజన మహిళ పంగి లావణ్యకు సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటన కూడా తీవ్ర ఆందోళన కలిగించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గంగవరం తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యం నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ వంతెనపై శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో 15కు పైగా గిరిజన గ్రామాలు రాకపోకల సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఒకవైపు టెక్నాలజీ పరుగులు పెడుతోందని, రాష్ట్రంలో అభివృద్ధి అంబరాన్ని తాకుతోందని పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మన్యం ప్రాంతంలో గర్భిణి ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉంటే.. అభివృద్ధి ఎక్కడ జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) గిరిజన ప్రాంతాల్లో(Tribal Areas) రహదారుల అభివృద్ధిపై(Road Development) చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన ప్రాంతాలన్నింటిలో మంచి రోడ్లు వేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటికీ కనీసం బైక్‌ కూడా వెళ్లలేని గ్రామాలకు సమాధానం చెప్పాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment