టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ‘సింగ్ గీతం’(Sing Geetham) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం మెగా 158 (Mega 158) చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదే జోష్‌లో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’లో (Aadarsha Kutumbam) నివేదా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. మొదట ఆమె స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌తో (Glimpse) ఆమె కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
విడుదలైన గ్లింప్స్‌లో వెంకటేష్ ఇంటి నుంచి కోపంగా బయటకు వస్తూ, “ఈ కాలం ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు” అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తారు. అదే సమయంలో ఎదురుగా నివేదా పేతురాజ్ చిరునవ్వుతో కనిపించడంతో వెంటనే తన మాట మార్చేస్తూ, “ఆడది అంటే ఇలా పువ్వులా నవ్వాలి. మా ఆవిడ పెళ్లి ఫోటోల్లో కెమెరామెన్ స్మైల్ ప్లీజ్ అన్నప్పుడు నవ్వింది… అప్పటి నుంచి ఇప్పటివరకు నవ్విందే లేదు” అంటూ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది.
అంతలో కమెడియన్ సత్య (Satya) ఎంట్రీ ఇచ్చి, “ఊరుకో నాయనా… ఇది మన ఆదర్శ కుటుంబం” అంటూ సీన్‌ను ముగించడంతో గ్లింప్స్‌కు మంచి కామెడీ టచ్ వచ్చింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, నివేదా పేతురాజ్ గ్లామరస్ ప్రెజెన్స్ కలిసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చేశాయి. ఈ చిత్రంలో శ్రీనిధి స్వర్ణ మరో కీలక పాత్రలో కనిపించనుండగా, నివేదా వెంకటేష్ ప్రియురాలి పాత్రలో నటిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు.
ఇది వెంకటేష్ కెరీర్లో 77వ చిత్రం కావడం విశేషం. టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) కీలక పాత్రలో నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ (Thaman) స్వరాలు అందిస్తున్నారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.






