---Advertisement---

Vijay Antony: ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పనున్న విజయ్‌ ఆంటోనీ.. అసలు కారణం అదేనా..?

June 9, 2026

---Advertisement---

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) ప్రస్తుతం ‘నూరుసామి’(Noorusamy) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శశి(Sasi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో విజయ్ సరసన స్వాసిక(Swasika) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

ఇక సినిమా ప్రమోషన్స్‌లో (Cinema Promotions) భాగంగా విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలోనే సినిమాలకు దూరం కావచ్చని ఆయన ఇచ్చిన హింట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఓ ఇంటర్వ్యూలో ‘నూరుసామి’ సినిమాలో రైతు (Farmer) పాత్రలో నటించిన అనుభవం ఎలా అనిపించింది..? అలాగే పల్లెటూరి జీవితం గురించి మీ అభిప్రాయం ఏంటి..? అని యాంకర్ ప్రశ్నించగా విజయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

“నాకు నిజంగా ఇష్టమైనది ప్రశాంతమైన, సరళమైన జీవనశైలి. నా పని చెన్నైలో ఉండటంతో ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. సంగీతం, నటన నా జీవితంలో భాగమే అయినా.. పల్లెటూరి జీవితం నాకు చాలా ఇష్టం. సాయంత్రం 6 లేదా 7 గంటలకే నిద్రపోవడం, ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వినడం, కోడిపుంజుల కూతలతో లేవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నిజం చెప్పాలంటే వచ్చే 2 లేదా 3 ఏళ్లలో పొల్లాచి వంటి ప్రాంతంలో స్థిరపడే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం అందుకు సరైన స్థలం కోసం వెతుకుతున్నాను. ఒకసారి పొలం కొంటే అక్కడే సెటిల్ అయిపోతాను” అంటూ విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.

విజయ్ ఆంటోనీ వ్యాఖ్యలు విన్న అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు(Movies) పూర్తిగా గుడ్ బై చెప్పి వ్యవసాయం వైపు వెళ్లాలని హీరో భావిస్తున్నారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, పోస్టులు వైరల్‌గా మారాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment