---Advertisement---

రేపే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ‘దళపతి’ కొత్త రాజకీయ శకం ప్రారంభం!

May 6, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు రంగం సిద్ధమైంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీకి చేరువయ్యారు. తొలి ప్రయత్నంలోనే ప్రజల్లో భారీ స్పందన తెచ్చుకుని, కొత్త రాజకీయ శకానికి నాంది పలికిన నాయకుడిగా నిలిచారు.

రేపు గురువారం ఉదయం చెన్నైలోని(Chennai) జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో (Jawaharlal Nehru Indoor Stadium) విజయ్ (Vijay) ప్రమాణ స్వీకార (Oath-taking) కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఇప్పటికే స్టేడియం చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో టీవీకే శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) విజయ్ చేత ప్రమాణం చేయించనున్నారు.

234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన సంఖ్య 118 కాగా, టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. పూర్తి మెజారిటీకి మరో 10 స్థానాలు అవసరమవుతున్న నేపథ్యంలో విజయ్ నేడు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు అంశం కీలకంగా మారింది. 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే దిశగా సానుకూల సంకేతాలు ఇచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్‌తో పాటు పీఎంకే, వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తే విజయ్‌కు మెజారిటీ సంఖ్య సులభంగా దాటే అవకాశం ఉంది.

మరోవైపు అన్నా డీఎంకే పార్టీలో అంతర్గత చర్చలు వేడెక్కాయి. కొందరు ఎమ్మెల్యేలు విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు రావడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించి తదుపరి వ్యూహాలపై చర్చించారు. టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా ప్రతిపక్షంలోనే కొనసాగాలా అనే అంశంపై పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.

మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కొత్త అలజడి సృష్టించారు. డీఎంకే ఆధిపత్యానికి సవాల్ విసురుతూ అత్యధిక స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పదవికి చేరువ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘దళపతి’గా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించిన విజయ్, ఇప్పుడు పాలనలో కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment