తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్(Vijay), స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu) రాజకీయ పరిణామాలు, విజయ్(Vijay) వ్యక్తిగత జీవితంపై (Personal Life) వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ప్రచారాలు మరింత వేగం పుంజుకున్నాయి.
ఇటీవల విజయ్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా త్రిష ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేసిందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, వారి స్నేహానికి ముగింపు పలికారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విజయ్, త్రిష మధ్య బ్రేకప్ (Breakup) జరిగిందనే ప్రచారం (Rumours) మరింత ఊపందుకుంది.
అయితే ఈ ఊహాగానాలన్నింటికీ త్రిష కేవలం 1 పోస్టుతోనే(Post) చెక్ పెట్టింది. విజయ్‌తో కలిసి కేక్ (Cake) కట్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె, “హ్యాపీ బర్త్‌డే టూ ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్” (Happy Birthday to the person who makes it all worth) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఒక్క పోస్టుతో విజయ్, త్రిష మధ్య దూరం పెరిగిందనే వార్తలకు పూర్తిగా తెరపడింది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్రేకప్ ప్రచారాలకు త్రిష తన స్టైల్‌లోనే సమాధానం చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
త్రిష షేర్ చేసిన ఫోటో, క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇద్దరి అభిమానులు కూడా ఈ పోస్టును భారీగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో విజయ్, త్రిష మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని మరోసారి స్పష్టమైంది.






