---Advertisement---

విజయవాడలో ఉద్రిక్తత.. డీఎస్సీ నిరసనకు వైఎస్సార్‌సీపీ పిలుపుతో భారీగా పోలీసుల మోహరింపు

September 21, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోని శాప్‌ కార్యాలయం వద్ద ధర్నాకు పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్‌ సర్కిల్‌, లబ్బిపేట తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను శాప్‌ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నట్లు పార్టీ నేతలు ఆరోపించారు. సెక్షన్‌ 30 అమల్లో ఉందంటూ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నట్లు తెలిపారు.

శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పోలీసుల ఆంక్షలను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు బాపట్ల జిల్లా చుండూరుపల్లి వద్ద విజయవాడ వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని పోలీసులు అడ్డుకుని, అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ నేతలకు నిరసన కార్యక్రమానికి హాజరు కావద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మచిలీపట్నంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించినట్లు తెలిపాయి. ఇదే సమయంలో శాప్‌ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా చేరుకున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అణచివేసే కుట్ర కు స్వస్తి పలికి డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ, సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment