2019 వన్డే ప్రపంచకప్ (ODI World Cup) సెమీఫైనల్లో(Semi-final) న్యూజిలాండ్ (New Zealand) చేతిలో ఎదురైన ఓటమి తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన దశగా నిలిచిందని టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు. వెస్టిండీస్‌తో(West Indies) తొలి వన్డేకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.
“ఆ ఓటమి నన్ను లోపలి నుంచి తీవ్రంగా కలిచివేసింది. దాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టమైంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది” అని కోహ్లీ చెప్పాడు.
వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మధ్య 2019 సెమీఫైనల్ రెండు రోజుల పాటు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239/8 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కివీస్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్(KL Rahul) ఒక్కో పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత ఎంఎస్ ధోనీ(MS Dhoni), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అద్భుతంగా పోరాడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరకు టీమిండియా 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా పడటం, కొత్త బంతితో కివీస్ బౌలర్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడం భారత్‌కు ప్రతికూలంగా మారిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అదే రోజు పూర్తయి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని పేర్కొన్నాడు.
2019 సెమీఫైనల్‌తో(2019 Semi-final) పాటు 2023 వన్డే ప్రపంచకప్ (2023 ODI World Cup) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని కూడా కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తాను 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ ఇన్నింగ్స్ ఆడగలననే నమ్మకం ఉందని, అయితే అనూహ్యంగా అవుట్ కావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు.
లీగ్ దశలో అద్భుతంగా రాణించిన తర్వాత ఫైనల్లో ఓడిపోవడాన్ని కొన్ని రోజుల పాటు జీర్ణించుకోలేకపోయానని కోహ్లీ తెలిపాడు. అదే సమయంలో 2023 ప్రపంచకప్ సందర్భంగా భారత జట్టులో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ఆయన ప్రశంసించాడు. ఆటగాళ్లు ఒకరికొకరు అండగా నిలిచిన తీరు తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నాడు.







