---Advertisement---

గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించిన వైఎస్సార్‌సీపీ అధినేత

October 2, 2026

Summarize with AI

---Advertisement---

మహాత్మా గాంధీ(Mahatma Gandhi), మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి (Lal Bahadur Shastri) జయంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎక్స్‌ వేదికగా మహనీయుల పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు.

అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ, ‘జై జవాన్‌.. జై కిసాన్‌’(Jai Jawan, Jai Kisan) నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి పోరాటం, త్యాగం తరతరాలకు ఆదర్శనీయమని జగన్‌ పేర్కొన్నారు. ఈ మహనీయుల జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment