---Advertisement---

స్థానిక పోరులో వైసీపీ దూకుడు.. తొలి మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి!

October 7, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో త్వరలో జరగనున్న మున్సిపల్(Municipal), కార్పొరేషన్(Corporation) ఎన్నికలకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) (YSRCP) ఇప్పటి నుంచే దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించడమే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తాడేపల్లిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కీలక నేతలతో వరుసగా వన్‌-టు-వన్ సమీక్షలు (One-to-One Reviews) నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డిని(Anam Vijay Kumar Reddy) ఖరారు చేస్తూ రాష్ట్రంలోనే తొలి మేయర్ అభ్యర్థిని (Mayor Candidate) వైసీపీ ప్రకటించింది. అంతేకాకుండా పలు కార్పొరేషన్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. కీలక నేతల వారసురాళ్లను సైతం మేయర్ అభ్యర్థులుగా బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నాడిని అంచనా వేసేందుకు అంతర్గత సర్వేలను ఆధారంగా చేసుకుని అభ్యర్థుల ఎంపికపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) అధికార కూటమికి వైసీపీ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment