---Advertisement---

విజయనగరం వైసీపీలో కీలక మార్పులు.. సన్యాసినాయుడికు నెల్లిమర్ల బాధ్యతలు.

September 13, 2026

Summarize with AI

---Advertisement---

విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP) కీలక మార్పులు చేపట్టింది. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)(Majji Srinivasa Rao – Chinna Srinu) పార్టీకి రాజీనామా చేసి, సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సమక్షంలో తన కుమార్తెతో కలిసి టీడీపీలో(TDP) చేరిన నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్‌ను (Bellana Chandrasekhar) నియమించినట్లు పార్టీ ప్రకటించింది.

అదే సమయంలో నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడిని (Gadala Sanyasi Naidu) నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు (Baddukonda Appalanaidu) నిర్వహించారు. చిన్న శ్రీనుకు బడ్డుకొండ అప్పలనాయుడు వియ్యంకుడు కావడంతో ఆయనను తప్పించి కొత్తగా సన్యాసినాయుడికి బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గదల సన్యాసినాయుడికి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడం వైఎస్సార్‌సీపీలో చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల కష్టాన్ని, పార్టీ కోసం పనిచేసిన వారి సేవలను గుర్తించే నాయకత్వానికి ఇదొక ఉదాహరణ అని నెల్లిమర్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. తాజా నియామకాలతో విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment