లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో రూపొందిన ‘సింగ్ గీతం’(Sing Geetham) సినిమాపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై చిరంజీవి ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా పరిశ్రమకు (Telugu Film Industry భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో రూపొందిన సింగ్ గీతం ఇండియన్ సినిమాలో (Indian Cinema) మరో మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇలాంటి గొప్ప దర్శకులను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ప్రయత్నం చేస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ను (Nag Ashwin) చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఒకవైపు పాత తరం ప్రతిభకు ప్రతీకగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు కొత్త తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్ కలిసి పనిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు.
అలాగే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోందన్నారు. నాగ్ అశ్విన్, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్తో (Vyjayanthi Movies) పాటు సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
"శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 11, 2026
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.
అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ… pic.twitter.com/tA6rvr14Il






