---Advertisement---

కూటమిలో కబ్జా రాయుళ్ల హవా.. ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన

June 12, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అధికార కూటమి నాయకులు, కార్యకర్తల అండదండలతో భూకబ్జాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ స్థలాలు, దేవాలయ ఆస్తులు, సామాన్య ప్రజల నివాస స్థలాలు, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు సైతం లక్ష్యంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కోట్ల రూపాయల విలువైన భూములను (Valuable Lands) ఆక్రమించి, స్థానిక రాజకీయ బలం ఆధారంగా అసలు యజమానులను బెదిరిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట భూకబ్జాలకు సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ, ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కబ్జాలకు (Encroachments) అధికార పార్టీ నాయకత్వం పరోక్ష మద్దతు ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో చిన్నస్థాయి నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక రూపంలో భూములపై వివాదాలు, ఆక్రమణల ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

అనంతపురంలో దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) అనుచరులు ఓ మైనారిటీ మహిళకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను (Commercial Complex) ఆక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా శాతవాహన కళాశాల భూములపై కన్నేసి, కళాశాల ప్రిన్సిపాల్‌ను కిడ్నాప్ చేయించారనే ఆరోపణలు కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.

చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు (Pattipati Pullarao) కనుసన్నల్లో ఓ ఎన్నారైకి చెందిన కోట్ల రూపాయల విలువైన కాంప్లెక్స్‌ను కబ్జా చేశారంటూ బాధితుడు సోషల్ మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నాడు. అనంతపురం శివారులో శోత్రియం భూముల ఆక్రమణ వెనుక జిల్లాకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి అండ ఉందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. విశాఖలో ఎంపీ భరత్‌కు (MP Bharat) సంబంధించిన గీతం విద్యాసంస్థ ప్రభుత్వ (GITAM Educational Institution) భూమిని ఆక్రమించి, అనంతరం అధికార అనుమతులతో దానిని సొంతం చేసుకుందనే ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి స్థానిక కార్యకర్తల వరకు భూకబ్జాలకు పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని విమర్శకులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ భూములు, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు సైతం రక్షణ లేకుండా పోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ స్థాయిలో భూదోపిడీలు గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తులే సురక్షితంగా లేవని, చిలకలూరిపేటకు చెందిన రావి మురళి ఉదంతం వంటి సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment