సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్ 2’(Jailer 2) విడుదలకు ముందే టికెట్ ధరల పెంపుతో(Ticket Price Hike)వార్తల్లో నిలిచింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి పెంచిన ధరలు తొలి వారం పాటు అమల్లో ఉంటాయి.
నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) విడుదల చేస్తోంది. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఈ ధరలు వర్తిస్తాయి.
ప్రభుత్వ అనుమతి ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా రూ.50 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకు పెంచుకోవచ్చు. అంతేకాకుండా తొలి 7 రోజులు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా అనుమతి లభించింది.
‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల బాధ్యతలు చేపట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విస్తృతంగా థియేటర్లు అందుబాటులోకి వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతితో తొలి వారం వసూళ్లపై ఆసక్తి పెరిగింది. రజనీకాంత్ ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తారో విడుదల తర్వాత తేలనుంది.







