---Advertisement---

రాజ్యాంగం కంటే ఎవరూ గొప్ప కాదు.. జ్ఞానేష్ కుమార్‌పై కేటీఆర్ కీలక డిమాండ్!

October 9, 2026

Summarize with AI

---Advertisement---

భారత రాజ్యాంగం (Indian Constitution) కంటే ఎవరూ గొప్పవారు కాదని, ఏ పౌరుడి (Citizen) ఓటు హక్కును హరించే అధికారం ఎవరికీ లేదని బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ, జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

వ్యవస్థలే ముఖ్యం.. వ్యక్తులు కాదు!

ఎంతోమంది వ్యక్తులు వచ్చి వెళ్లినా, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారతదేశం (India) బలంగా నిలబడిందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు వ్యవస్థలను పక్కనపెట్టి, ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకింత ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రాథమిక హక్కుల (Indians Fundamental Rights) కంటే ఒక వ్యక్తి ఎలా ముఖ్యమవుతారని నిలదీశారు.

దేశ రాజ్యాంగ మూలసూత్రాలను పక్కనపెట్టి, సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రయత్నించే వారికి కాలం చెల్లిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఓటరు జాబితా అక్రమాలపై విచారణ జరపాలి

ఓటరు జాబితా (Voter List) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో (SIR) తీవ్ర అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తక్షణమే స్పందించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో(Sitting Judge) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటు హక్కుకు ప్రాధాన్యం ఉందని పేర్కొన్న కేటీఆర్, రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఎలాంటి భంగం కలగకూడదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment