ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆక్వా ఫీడ్ (Aqua Feed) ధరల పెంపుపై వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) గడువు విధించారు. ఈ నెలాఖరులోగా పెంచిన ఆక్వా ఫీడ్(Aqua Farmers) ధరలను తగ్గించాలని, లేకపోతే జూలై 1 లేదా 2 తేదీల్లో ఆక్వా రైతుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తాను కూడా ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలిచేలా రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను (Rythu Bharosa Kendras) ఏర్పాటు చేశామని, ఆక్వా రంగం కోసం 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 782 ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించామని గుర్తు చేశారు.
అప్సడా చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రినే ఛైర్మన్‌గా (Chairman) నియమించడం ద్వారా సిండికేట్లకు అవకాశం లేకుండా చేశామని, ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందించామని తెలిపారు. ఈ సబ్సిడీ కింద 57 నెలల్లో రూ.3,306 కోట్లు ప్రభుత్వం భరించిందని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వంలో (TDP Government) యూనిట్‌కు రూ.3.82 వసూలు చేశారని, అప్పటి బకాయిలైన రూ.340 కోట్లను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు.
తమ పాలనలో రొయ్యలు (Prawns), మత్స్య ఉత్పత్తి (Fish Production) 38 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెరిగిందని, ఆక్వా ఎగుమతుల విలువ కూడా గణనీయంగా పెరిగిందని జగన్ వివరించారు. ఫీడ్ కంపెనీలు ధరలు పెంచిన సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మూడుసార్లు వాటిని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుందని చెప్పారు.
ప్రస్తుతం ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్‌గా వ్యవహరిస్తున్నాయని ఆరోపించిన జగన్, ఫిబ్రవరిలో కిలోకు రూ.4 పెంచిన ఫీడ్ ధరలను జూన్‌లో మరో రూ.10 నుంచి రూ.12 వరకు పెంచారని విమర్శించారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని, లేకుంటే ఆక్వా రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు.






