విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో చోటుచేసుకున్న క్రాంతికుమార్ (Kranti Kumar) మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కృష్ణలంక సీఐ నాగరాజు(CI Nagaraju) వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని క్రాంతికుమార్ (Kranti Kumar) భార్య(Wife) ప్రభావతి (Prabhavathi ఆరోపించారు. స్టేషన్కు పిలిచినప్పుడల్లా చిత్రహింసలకు గురిచేసేవారని, తాళ్లతో చేతులు కట్టి తీవ్రంగా కొట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరణానికి ముందు కూడా సీఐ వేధింపులు (CI Harassment) భరించలేకపోతున్నానని క్రాంతికుమార్ ఫోన్లో చెప్పాడని తెలిపారు. తన భర్త మృతికి పూర్తిగా సీఐ నాగరాజే బాధ్యుడని పేర్కొంటూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముగ్గురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (Malladi Vishnu), ప్రజలను రక్షించాల్సిన పోలీసుల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయని విమర్శించారు. సాయికృష్ణ మరణం తర్వాత ఇప్పుడు క్రాంతికుమార్ మృతి కూడా పోలీసు వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరియు హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్వయంగా కుటుంబాన్ని పరామర్శించాలని కోరారు.
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) మాట్లాడుతూ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలు రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసు దౌర్జన్యాలకు నిదర్శనమని ఆరోపించారు. సాయికృష్ణ కుటుంబం నెలరోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పరామర్శించిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని అన్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh) కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాలనే ఉల్లంఘిస్తున్నారని, కేసులు ఉన్నాయనే పేరుతో వ్యక్తులను వేధించడం లేదా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని ప్రశ్నించారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై సీపీ(CP), డీజీపీ(DGP), హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






