ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) పాలనపై విమర్శలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక, రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక పాలకుడికి అత్యంత అవసరమైన ఓర్పు, సహనం వంటి లక్షణాలు ఆయన ప్రవర్తనలో కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిపాలనలో (Administration) ఎదురవుతున్న సమస్యలు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, అధికారులపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు అన్నీ తెలుసనే ధోరణితో ఎదుటివారి వివరణ వినకుండా మందలించడం తరచూ కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల ఒక మహిళా అధికారిని ఉద్దేశించి, “నువ్వు ఏంటమ్మా నాకు చెప్పేది… నాకు కథలు చెప్తున్నావా?” అంటూ తీవ్రంగా స్పందించడం, ఐఎఫ్ఎస్(IPS) అధికారులతో “నేను ఇచ్చిన పుస్తకాలు చదివి నాకే ఉపన్యాసాలు ఇస్తారా?” అని వ్యాఖ్యానించడం, ఒక జిల్లా కలెక్టర్ (District Collector) వైఖరిపై బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి ఘటనలు విస్తృత చర్చకు దారితీశాయి. ఫారెస్ట్ అధికారులతోనూ ఆయన అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రజల సమస్యలు వినేందుకు వచ్చిన వారిపట్ల కూడా ఇదే ధోరణి కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. పర్యటనల సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు ప్రయత్నించిన ప్రజలను పోలీసులు (Police) అడ్డుకోవడం, బనగానపల్లెలో జరిగిన “మీ భూమి–మా హక్కు” కార్యక్రమంలో సమస్యలు చెప్పేందుకు వచ్చిన మహిళలను “కొత్తగా ఈ డ్రామాలు నేర్చుకున్నారు… మధ్యలో డిస్టర్బ్ చేయకండి” అంటూ వారించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనపై పట్టు సడలిపోయిందని, అధికార యంత్రాంగంలో సమన్వయం లోపించిందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై వస్తున్న విమర్శలు, పెరుగుతున్న ఒత్తిడే ముఖ్యమంత్రి ప్రవర్తనలో అసహనంగా ప్రతిబింబిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే, పరిపాలనలో లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అధికారులపై, ప్రజలపై ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా సమస్యల పరిష్కారం (Problem Resolution) సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే ఈ తరహా వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు.







