---Advertisement---

YS Jagan: రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం!

June 21, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రైతుల (Farmers) సంక్షేమంపై మరోసారి రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) రైతులపై ఉన్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామాను విస్మరించి రైతులను తీవ్రంగా మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్(Super Six), సూపర్ సెవెన్‌తో పాటు మొత్తం 143 హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

తమ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కరోనా (COVID-19) వంటి క్లిష్ట పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 53.58 లక్షల రైతు కుటుంబాలకు నిరంతరంగా రైతు భరోసా అందించిందని జగన్ గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు.

రైతు భరోసా నిధుల్లో భారీ కోతలు.. 7 లక్షల మంది రైతులకు అన్యాయం

పీఎం కిసాన్ పథకానికి (PM-Kisan Scheme) అదనంగా ప్రతి ఏడాది రైతులకు రూ.20 వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదనపు సాయం పేరిట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 2025-26లో రూ.20 వేల స్థానంలో కేవలం రూ.14 వేలే ఇచ్చారని, 2026-27లో ఇవ్వాల్సిన రూ.26 వేల బదులు కేవలం రూ.5 వేలకే పరిమితం చేశారని మండిపడ్డారు.

మూడేళ్లలో ఒక్కో రైతుకు మొత్తం రూ.60 వేలు అందించాల్సి ఉండగా కేవలం రూ.19 వేలే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని జగన్ విమర్శించారు. అంతేకాకుండా రైతు భరోసా (Rythu Bharosa) లబ్ధిదారుల సంఖ్యను 53.58 లక్షల నుంచి 46.85 లక్షలకు తగ్గించి సుమారు 7 లక్షల మంది రైతులను పథకం నుంచి తొలగించారని ఆరోపించారు. ముఖ్యంగా కౌలు రైతులు, పట్టాలు కలిగిన గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

గిట్టుబాటు ధరలు లేవు.. బీమా పథకాన్ని కూడా రద్దు చేశారని ఆరోపణ

రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర (Remunerative Price) కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. వరి, మామిడి సహా అనేక పంటల ధరలు భారీగా పడిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఉచిత పంటల బీమా (Free Crop Insurance) పథకాన్ని రద్దు చేసి రైతులపై అదనపు భారం మోపారని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియంను (Insurance Premium) కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం పంటల బీమా కోసం రూ.7,802 కోట్లు చెల్లించిందని జగన్ వెల్లడించారు.

రైతు సంక్షేమ వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న జగన్

మోంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడే సున్నా వడ్డీ రుణాల పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు(Rythu Bharosa Kendras – RBKs), ఈ-క్రాప్ వ్యవస్థ (E-Crop System), టెస్టింగ్ ల్యాబ్‌లు (Testing Laboratories) వంటి రైతు సేవా వ్యవస్థలను కూడా బలహీనపరిచారని ఆరోపించారు. రైతులకు నేరుగా ఉపయోగపడే కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటోందని పేర్కొన్నారు.

ఆక్వా, మామిడి, పొగాకు రైతులకు తీవ్ర నిరాశ

ఆక్వా రంగంపై (Aqua Sector) ప్రభుత్వం అదనపు భారం మోపిందని జగన్ ఆరోపించారు. మేత ధరలు భారీగా పెరగడం, రొయ్యల ధరలు పడిపోవడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా మేత ధరను కిలోకు కేవలం రూ.2 మాత్రమే తగ్గించడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆక్వా రైతులకు అందించే విద్యుత్ సబ్సిడీని కూడా నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మామిడి రైతులకు (Mango Farmers) గతంలో ప్రకటించిన రూ.380 కోట్ల సాయాన్ని ఇప్పటికీ విడుదల చేయలేదని, ఈ ఏడాది కూడా వారిని మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. మరోవైపు పొగాకు ధరలు పూర్తిగా కుప్పకూలినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతి ఎన్నికల హామా అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సంక్షేమం అందించడంలో పూర్తిగా వెనుకబడిందని జగన్ ఆరోపించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఇచ్చిన హామీలను తాము అధికారంలో ఉన్న సమయంలో సమర్థవంతంగా అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment