---Advertisement---

పులిగడ్డలో లోకేష్‌కు షాక్.. బెల్టుషాపులపై మహిళల నిలదీత.

June 24, 2026

Summarize with AI

---Advertisement---

అవనిగడ్డ (Avanigadda) నియోజకవర్గంలోని పులిగడ్డ గ్రామంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌కు(Nara Lokesh) స్థానిక మహిళలు (Local Women) ఊహించని విధంగా ప్రశ్నలు సంధించారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం (Liquor) విక్రయాలు జరుగుతున్నాయని, బెల్టు షాపుల (Belt Shops) కారణంగా కుటుంబాల్లో గొడవలు పెరుగుతున్నాయని మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మద్యం షాపు ఉందా అని లోకేష్‌ మహిళలను ప్రశ్నించగా, అవనిగడ్డలోని వైన్‌ షాపుల (Belt Shops) నుంచి మద్యం తెచ్చి గ్రామంలోనే అక్రమంగా విక్రయిస్తున్నారని వారు వివరించారు. బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాలని మహిళలు కోరగా, ఈ విషయాన్ని తాను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు.

అయితే గ్రామంలో జరుగుతున్న మద్యం విక్రయాలపై అవగాహన లేనట్టుగా లోకేష్‌ మహిళలనే ప్రశ్నించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపుల (Belt Shops) వ్యవహారం గురించి ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో మంత్రి స్పందనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి(TDP) చెందిన సీనియర్ నేత శావల దేవదత్ (Shaval Devadath) గతంలో బెల్టు షాపుల ఉనికిపై చేసిన వ్యాఖ్యలను మహిళలు గుర్తు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు పెరిగాయని, వాటి ప్రభావంతో శాంతిభద్రతల (Law and Order) సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మద్యం కారణంగా కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని, మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వనికి పూర్తి అవగాహన ఉన్నా ఏమీ తెలియనట్టు ప్రజల ముందు మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment