కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో జరిగిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ కేసు (Lockup Case) దర్యాప్తులో సిట్(SIT) అధికారులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. సీఐ నాగరాజు(CI Nagaraju) అరెస్ట్ అనంతరం జరిపిన విచారణలో మరికొందరి పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిట్, ఈ కేసులో షాకింగ్ వివరాలను నమోదు చేసింది.
సిట్(SIT) దర్యాప్తు ప్రకారం, సాయికృష్ణ (Head Constables) మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వ్యక్తి సహకరించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే హెడ్ కానిస్టేబుళ్లు అశోక్(Ashok), నాని(Nani), అలాగే సీఐ సన్నిహితుడు సురేష్(Suresh) పరారైనట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ అశోక్ సీఐ అసిస్టెంట్‌గా వ్యవహరించగా, మరో హెడ్ కానిస్టేబుల్ నాని(Nani) సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్మెంట్లు, ఇతర అక్రమ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
నానిపై గతంలో గన్నవరం(Gannavaram), పటమట పోలీస్ స్టేషన్లలో (Patamata Police Stations) పనిచేసిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో అతడిని వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా (Head Constable) పోస్టింగ్ పొందాడు. ఇక సురేష్(Suresh) అనే ప్రైవేట్ వ్యక్తి సాయికృష్ణ మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించడం, ఆధారాలను మాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అనుమానిస్తోంది.
గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను ఒక సెటిల్మెంట్ విషయమై సురేష్ పిలిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్(Ashok), నానిలతో కలిసి నల్లటి రంగు వాహనంలో వడ్డేశ్వరంలోని నవరంగ్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు నవరంగ్ సిట్ అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
సాయికృష్ణ మృతదేహాన్ని దాచడం లేదా వేరే ప్రాంతానికి తరలించడంలో ఈ ముగ్గురూ సీఐ నాగరాజుతో(CI Nagaraju) కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, అలాగే ప్రైవేట్ వ్యక్తి సురేష్ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. వీరిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.






