రాజధాని (Capital) ప్రాంతంలో వైసీపీ నాయకులపై (YSRCP Leaders) జరిగిన దాడి (Attack) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతం నిజంగా అందరి ప్రజలదేనా? లేక కొందరి ఆధీనంలో ఉన్న ప్రాంతమా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలోకి ఎవరైనా వెళ్లే హక్కు ఉందా? లేక ఒక వర్గం అనుమతిస్తేనే వెళ్లాలా? రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నప్పుడు, “ఫలానా వారు రావొద్దు”, “వారికి అనుమతి లేదు” అనే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలందరి పన్నులతో నిర్మించాల్సిన రాజధానిలో కొంతమందికే ప్రవేశం ఉంటే, దానిని నిజమైన ప్రజా రాజధానిగా (Public Capital) ఎలా పరిగణించాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో రాజధాని భూ సేకరణ (Land Acquisition) అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే సుమారు 50 వేల ఎకరాల భూమి తీసుకున్నప్పటికీ, అది “మున్సిపాలిటీ”(Municipality స్థాయికే సరిపోతుందని, ప్రపంచ స్థాయి రాజధాని కోసం మరో 50 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం (Government) భావిస్తోందన్న ప్రచారం రైతుల్లో ఆందోళనకు కారణమైంది.
దాదాపు 12 ఏళ్లుగా భూములు ఇచ్చిన రైతుల్లో(Farmers) చాలా మంది తమకు రావాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు పూర్తిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ప్లాట్లు విక్రయించలేక పిల్లల చదువులు(Children’s Education), పెళ్లిళ్లు(Marriages), కుటుంబ అవసరాలకు (Family Needs) కూడా ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని రైతులు వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (Y.S. Jagan Mohan Reddy) కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం రైతులకు అండగా ఉండేందుకు వైసీపీ సీఆర్డీఏ కమిటీని (CRDA Committee) ఏర్పాటు చేయడంతో పాటు న్యాయపరమైన సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. రైతుల ఆహ్వానం మేరకే ఆ కమిటీ రాజధాని ప్రాంతానికి వెళ్లిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో “రాజధాని ప్రాంతానికి మిమ్మల్ని ఎవరు వెళ్లమన్నారు?” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకుల పర్యటనను తప్పుగా చిత్రీకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతుందని భావించి వైసీపీ(YSRCP) గతంలో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రతిపాదించింది. ఆ ఆలోచనకు గత ఎన్నికల్లో గణనీయమైన 40% ఓటర్ల మద్దతు లభించిందని ఆ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటు వేసిన లక్షలాది మంది ప్రజలకు రాజధాని ప్రాంతంలోకి వెళ్లే హక్కు లేదా? ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో ప్రజల ప్రవేశాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడితే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలందరి పన్నులతో నిర్మించాల్సిన రాజధాని ఒక రాజకీయ వర్గానికే పరిమితమైతే, దానిని “ప్రజల రాజధాని”గా ఎలా చెప్పగలమనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.






