---Advertisement---

స్వామి వారి చిత్రపటాలు చెత్తకుప్పల్లోనా? టీటీడీ నిర్లక్ష్యంపై భూమన తీవ్ర ఆరోపణలు

June 29, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమలలో టీటీడీ (Tirumala TTD), విజిలెన్స్ (Vigilance) వ్యవస్థల నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి–జూపార్క్ (Alipiri-Zoo Park Road) రోడ్డులో వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara) చిత్రపటాలు చెత్తకుప్పల్లో(Garbage Heaps), మలమూత్రాలు(Human Waste), బీరు బాటిళ్ల (Beer Bottles) మధ్య పడి ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu) పాలనలో టీటీడీని(TTD) పరిరక్షిస్తున్నామని చెప్పుకుంటూనే క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. అలిపిరి (Alipiri) సమీపంలోని స్వామివారి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన ప్రదేశాల్లో వందల వేల చిత్రపటాలు అత్యంత నిర్లక్ష్యంగా పడివున్నాయని పేర్కొన్నారు. టీటీడీ అధికారులు చిత్రపటాలను స్వయంగా పడేశారని తాము చెప్పడం లేదని, అయితే ఇది విజిలెన్స్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

గత రెండేళ్లుగా టీటీడీలో ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. స్వామివారి చిత్రపటాలు మలమూత్రాలు, బీరు బాటిళ్ల మధ్య ఉండడం అత్యంత బాధాకరమని, వాటిని వెంటనే తొలగించి గౌరవప్రదంగా నిర్వహించాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందన్నారు.

టీటీడీ ఈవో, చైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) సహా పాలకవర్గం ఈ ఘటనపై బాధ్యత వహించాలని, ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడం సిగ్గుచేటని భూమన వ్యాఖ్యానించారు. టీటీడీ ప్రక్షాళన పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సనాతన ధర్మం(Sanatana Dharma), సంప్రదాయాలను కాపాడతామని చెప్పే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) ఉద్దేశిస్తూ కూడా భూమన విమర్శలు చేశారు. తిరుమలలో స్వామివారి చిత్రపటాల పరిస్థితిని స్వయంగా వచ్చి చూడాలని, ఇదేనా ప్రక్షాళన అంటూ ప్రశ్నించారు. టీటీడీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం పెరిగిపోయాయని ఆరోపిస్తూ, ఈ ఘటనకు ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాజకీయంగా, పరిపాలనా పరంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment