వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy) బుధవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం (Media Conference) నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని (Tadepalli) పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ ప్రెస్మీట్లో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రజా సమస్యలు (Public Issues), కూటమి ప్రభుత్వ (Coalition Government) వైఫల్యాలపై (Failures) ఆయన స్పందించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవల అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి(Undavalli), పెనుమాక(Penumaka) రైతుల సమస్యలను (Farmers Issues) తెలుసుకునేందుకు వెళ్లిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీపై (CRDA Farmers Protection Committee) దాడి జరిగిన ఘటన, విజయవాడలో సంచలనం సృష్టించిన లాకప్ డెత్ వ్యవహారం, రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతల పరిస్థితి వంటి అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.
అలాగే మామిడి రైతులు(Mango Farmers), ఆక్వా రైతుల (Aqua Farmers) ఇబ్బందులు, ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు, రాష్ట్ర పాలనలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






