---Advertisement---

జగన్ వైపు రైతు చూపు.. కూటమి రెండేళ్ల పాలనపై గ్రామాల్లో మారుతున్న చర్చ!

July 1, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Alliance Government) రెండేళ్ల పాలన పూర్తవుతున్న వేళ రైతాంగంలో అసంతృప్తి పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే జగన్ (Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వానికంటే మెరుగైన సంక్షేమం(Welfare), మరింత అధునాతన వ్యవసాయ విధానాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలపై ఇప్పుడు రైతులు(Farmers) ప్రశ్నలు సంధిస్తున్నారని రైతు సంఘాలు (Farmers’ Associations) పేర్కొంటున్నాయి.

రైతుల అభిప్రాయం ప్రకారం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం, మద్దతు ధర, నాణ్యమైన ఉచిత విద్యుత్ (Quality Free Electricity) వంటి అంశాలు సకాలంలో అందేవని చెబుతున్నారు. ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించిన ప్రతి సమస్యపై రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాతే స్పందన వస్తోందని, అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శిస్తున్నారు. కూటమి పాలకులకు ప్రచార యావ తప్ప తమ గోడు వినిపించుకునే తీరిక కూడా లేదని విమర్శలు చేస్తున్నారు.

గత రెండేళ్లలో పొగాకు(Tobacco), మామిడి(Mango), పత్తి(Cotton), మిర్చి(Chilli), పామాయిల్(Palm Oil), ఆక్వా (Aqua) వంటి పలు రంగాల రైతులు నిరసనలకు దిగాల్సి వచ్చిందని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. గత జగన్ పరిపాలనలో తమ హక్కుల కోసం ప్రభుత్వాలను వేడుకోవాల్సిన పరిస్థితి లేదని, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వం తమ సమస్యలను గుర్తిస్తున్నదని వారు అంటున్నారు.

ప్రత్యేకంగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) మరియు అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ సాగుతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కింద రూ.50 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చినా, అమలులో మాత్రం ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.67,500 అందించారని గుర్తుచేస్తున్నారు.

దీనికి విరుద్ధంగా, కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలులో అర్హులైన రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చివరి ఏడాది (2023–24)లో రైతు భరోసా కింద 53.18 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 46.86 లక్షలకు తగ్గినట్లు ప్రభుత్వ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడైందని రైతు సంఘాలు చెబుతున్నాయి. తొలి ఏడాది పథకం అమలు చేయకపోవడం, అనంతరం అర్హతల పేరుతో అనేక మందిని జాబితా నుంచి తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాగే, జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా (Free Crop Insurance) రద్దు కావడం వల్ల ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అందించే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కూడా నిలిచిపోయిందని, ఇప్పటివరకు వడ్డీ రాయితీ విడుదల కాకపోవడంతో లక్షలాది మంది రైతులు(Farmers) నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)(RBK) నిర్వీర్యం, ఈ-క్రాప్ (E-Crop) వ్యవస్థ బలహీనపడటం, పంట నష్టం జరిగిన అదే సీజన్‌లో పరిహారం చెల్లించే విధానం నిలిచిపోవడం వంటి అంశాలు రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఇటీవల తుపాన్లతో నష్టపోయిన రైతులకు కూడా ఇప్పటివరకు తగిన సాయం అందలేదని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

మరోవైపు, జగన్ ప్రభుత్వ హయాంలో అమలైన పలు వ్యవసాయ కార్యక్రమాలను రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులు, దేవాదాయ భూముల రైతులకు కూడా రైతు భరోసా అందించడం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తుల సహాయ నిధి, కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, యంత్రసేవ, అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు, పశు బీమా, సంచార పశు ఆరోగ్య సేవలు, ఆక్వా రంగానికి రాయితీలు, ధాన్యం కొనుగోళ్లలో జీఎల్‌టీపీ చెల్లింపులు, అదనపు పంటలకు కనీస మద్దతు ధర వంటి పలు కార్యక్రమాలు రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడ్డాయని చెబుతున్నారు.

అదేవిధంగా అసైన్ భూములపై పూర్తి హక్కులు, 22ఏ జాబితా నుంచి ఇనాం భూముల తొలగింపు, భూమిలేని నిరుపేదలకు భూముల కేటాయింపు, లంక భూములు, చుక్కల భూములు, డీకేటీ భూములు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పరిష్కారం వంటి భూ సంస్కరణల ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, జగన్(YS Jagan) ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అనేక వ్యవస్థలు ప్రస్తుతం బలహీనపడ్డాయని, కొన్ని పథకాలు పూర్తిగా రద్దయ్యాయని, కొనసాగుతున్న పథకాలలో కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గించబడుతోందనే అభిప్రాయం రైతాంగంలో పెరుగుతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వ (Alliance Government) రెండేళ్ల పాలనను, జగన్ ఐదేళ్ల పాలనను గ్రామాల్లో రైతులు పరస్పరం పోల్చుకుంటూ చర్చించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment