వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రాజధాని (Capital) అంశంపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “మావిగన్‌కు(MAVIGUN) మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి(MAVIGUN Verses AMARAVATI) అనే అంశంపైనే జరుగుతాయి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అప్పుడే తేలుతుంది. అవినీతికి తావులేని రాజధాని నిర్మాణమే మా లక్ష్యం” అని వ్యాఖ్యానించారు.
అమరావతికి తాను వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతి, భూ లావాదేవీలు, రైతుల సమస్యలపైనే తన పోరాటమని జగన్ స్పష్టం చేశారు. “నేను అమరావతికి వ్యతిరేకమని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. నేను వ్యతిరేకించేది అక్కడ జరుగుతున్న అవినీతి, స్కాంలను మాత్రమే. రైతుల తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. మావిగన్‌కు మద్దతు ఇచ్చే వారు వైఎస్సార్‌సీపీకి(YSRCP) ఓటు వేస్తారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో (Manifesto) కూడా మావిగన్ ప్రతిపాదనను పొందుపరుస్తాం” అని తెలిపారు.
29 గ్రామాల్లో రాజధాని(Capital) పేరిట జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎప్పటికీ సమర్థించదని ఇప్పటికే పలుమార్లు చెప్పిన జగన్, ప్రభుత్వ ఖజానాపై భారీ భారం లేకుండా విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం (మావిగన్) ప్రాంతాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్రానికి ప్రయోజనకరమైన రాజధాని నమూనా అని మరోసారి స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనతో తెలుగుదేశం పార్టీ(TDP) రాజకీయంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమరావతి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని కూటమి చెబుతున్నప్పటికీ, మావిగన్‌లో భాగమైన విజయవాడ, గుంటూరు ప్రాంతాలు కూడా సీఆర్‌డీఏ(CRDA) పరిధిలోనే ఉండటంతో ఈ ప్రతిపాదనకు న్యాయపరమైన చిక్కులు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొదటి నుంచీ 29 గ్రామాల్లో భూముల లావాదేవీలు, నిర్మాణాల పేరుతో జరుగుతున్న అవినీతినే తాను వ్యతిరేకిస్తున్నానని చెబుతున్న జగన్, అదే సీఆర్‌డీఏ పరిధిలోని మరో ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం సహేతుకమైన ఆలోచనేనని ప్రజల్లో కూడా చర్చ సాగుతోంది.
అయితే, రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం ప్రాంతాన్ని పక్కనబెట్టి, 29 గ్రామాలే రాజధానిగా ఉండాలనే పట్టుదలపై కూటమి కొనసాగితే, ఆ గ్రామాల్లో జరిగిన భూ లావాదేవీలు, నిర్మాణాలపై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో మరింత చర్చ మొదలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.







మావిగన్ 👍👍