---Advertisement---

విద్యా విప్లవం నుంచి విద్యా తిరోగమనమా? ఏపీలో ఎందుకు ఈ చర్చ?

July 1, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రభుత్వ విద్యారంగంపై (Government Education Sector) గత కొంతకాలంగా తీవ్ర చర్చ సాగుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల (Government Schools) రూపురేఖలను మార్చాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పురోగతి నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్(Nara Lokesh) నాయకత్వంలో గత ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమయ్యాయని కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నాడు-నేడు(Nadu-Nedu) కార్యక్రమం ద్వారా వేలాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ఫర్నిచర్, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు వంటి వసతులు ఏర్పాటు చేశారు.

జగనన్న అమ్మఒడి(Jagananna Amma Vodi), జగనన్న విద్యా కానుక(Jagananna Vidya Kanuka), జగనన్న గోరుముద్ద (Jagananna Gorumudda) వంటి పథకాల ద్వారా విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక మరియు పోషకాహార పరమైన మద్దతు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను (English Medium) విస్తృతంగా అమలు చేయడంతో పాటు, వెయ్యికి పైగా పాఠశాలలకు సీబీఎస్సీ(CBSE) అనుబంధం కల్పించడం, విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడం, టోఫెల్ శిక్షణ అందించడం, అంతర్జాతీయ ప్రమాణాల సిలబస్ వైపు అడుగులు వేయడం వంటి చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమాల ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్మెంట్) (Student Enrolment) శాతం 2018లో 63.2 శాతం నుంచి 2022 నాటికి 70.8 శాతానికి పెరిగిందని అప్పటి గణాంకాలు సూచించాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారిందని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత సీబీఎస్సీ అనుబంధాన్ని ఉపసంహరించడం, నాడు-నేడు మూడో దశ పనులు నిలిపివేయడం, డిజిటల్ విద్యా కార్యక్రమాల వేగం తగ్గడం, ట్యాబ్‌ల పంపిణీ నిలిచిపోవడం, అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం (Talliki Vandanam) పథకం అమలులో జాప్యం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అలాగే జగనన్న గోరుముద్ద (Jagananna Gorumudda) నాణ్యత తగ్గిందని, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు వచ్చాయని, విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా సకాలంలో అందడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

విద్యార్థుల నమోదు గణాంకాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కలిపి సుమారు 2.66 లక్షల మంది విద్యార్థుల నమోదు తగ్గినట్లు సమాచారం. మొదటి తరగతి అడ్మిషన్లు 6.87 లక్షల నుంచి 5.60 లక్షలకు పడిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,750 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం, అలాగే సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు మారినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ గణాంకాలను చూపుతూ విద్యావేత్తలు, తల్లిదండ్రుల సంఘాలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గడం, నాణ్యత క్షీణించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంచాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన బోధన, డిజిటల్ విద్యా కార్యక్రమాల పునరుద్ధరణ, విద్యార్థి సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం (Coalition Government) అనవసర మీడియా ప్రచారలకు స్వస్థి పలికి అత్యవసరంగా దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment