---Advertisement---

నాలుగో కేసులోనూ ప్రశ్న రావణ్‌కు బెయిల్.. ఇక విడుదలేనా?

July 4, 2026

Summarize with AI

---Advertisement---

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు (Prashna Ravan) నాలుగో కేసులోనూ కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) విమర్శించారనే ఆరోపణలతో వరుసగా కేసులు నమోదు చేసి గత మూడు రోజులుగా పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ అరెస్టులు చూపిస్తున్న నేపథ్యంలో, నక్కపల్లి (Nakkapalli) పోలీస్ స్టేషన్‌లో (Police Station) నమోదైన కేసులో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే పిఠాపురం(Pithapuram), కాకినాడ(Kakinada), మచిలీపట్నం (Machilipatnam) కేసుల్లో అరెస్టు చేసిన అనంతరం ఆయా కోర్టులు రిమాండ్‌ను తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నక్కపల్లి కేసులో కూడా అదే తరహా నిర్ణయం వెలువడటంతో ప్రశ్న రావణ్‌కు (Prashna Ravan) నమోదైన నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది.

అయితే ఈ కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తారా లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బెయిల్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రశ్న రావణ్ తనకు మద్దతుగా నిలిచిన మీడియా ప్రతినిధులకు, తన తరఫున వాదించిన న్యాయవాది జడా శ్రవణ్‌కు (Jada Shravan) కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వరుస అరెస్టులు, ప్రతి కేసులోనూ బెయిల్ లభించడం వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యలతో జనసేన(Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం దక్కలేదని, పైగా ప్రతిష్టకు భంగం కలిగిందనే అభిప్రాయాలు అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment