---Advertisement---

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న 3 మహిళలపై దూసుకెళ్లిన బొలెరో!

July 9, 2026

Summarize with AI

---Advertisement---

రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) విషాదాన్ని నింపింది. శంషాబాద్ (Shamshabad) పరిధిలోని సత్తంరాయ్ (Sathamrai) వద్ద బస్ స్టాప్‌లో (Bus Stop) బస్సు కోసం వేచి చూస్తున్న 3 మంది మహిళలపై(Womens) అదుపు తప్పిన బొలెరో వాహనం (Bolero Vehicle) దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. మిర్చి లోడ్‌తో (Chilli Load) వెళ్తున్న బొలెరో వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. దీంతో డ్రైవర్ (Driver) వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బొలెరో నేరుగా రోడ్డుపక్కనున్న బస్ స్టాప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం నిలబడి ఉన్న 3 మంది మహిళలను బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు మహిళలు బొలెరో వాహనం కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సత్తంరాయ్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ప్రమాదం అనంతరం శంషాబాద్–సత్తంరాయ్ (Shamshabad-Sathamrai) మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment