---Advertisement---

జూనియర్ ఆర్టిస్టులతో జగన్‌పై టీడీపీ వ్యవస్థీకృత కుట్ర?

July 12, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సోషల్ మీడియా వేదికగా (Social Media Platform) జరుగుతున్న రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. మహిళలపై అసభ్యకర ట్రోలింగ్(Women Obscene Trolling), మార్ఫింగ్ వీడియోలను (Morphing Videos) అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ (Social Media Task Force) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ టాస్క్ ఫోర్స్ అసలు ఉద్దేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష వైసీపీ(YSRCP) నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు మరియు సామాన్యుల గొంతు నొక్కేందుకేనని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలపై (TDP Social Media Activities) కొత్త వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) అనుకరిస్తూ వీడియోలు చేసే జూనియర్ ఆర్టిస్ట్ రావినూతల సునీల్ (Ravinuthala Sunil) విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను కేవలం నటుడినేనని, స్క్రిప్ట్, డైరెక్షన్, ప్రొడక్షన్, మార్ఫింగ్ వంటి అంశాలతో తనకు సంబంధం లేదని, కొందరు డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు చేయిస్తున్నారని ఆయన వెల్లడించడం మరిన్ని ప్రశ్నలకు దారితీసింది.

రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని వైఎస్ భారతీ రెడ్డి (YS Bharathi Reddy) ఫోటోలను మార్ఫింగ్ చేసి వీడియోల్లో ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ చర్చకు బదులుగా వ్యక్తిత్వ హననాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృతంగా కంటెంట్ రూపొందించడం ప్రజాస్వామ్యానికి (Democracy) ప్రమాదకరమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి ప్రచారాలు కొత్తవి కావని విమర్శకులు చెబుతున్నారు. గతంలో కూడా శేఖర్ చౌదరి (Shekhar Chowdary) అనే జూనియర్ ఆర్టిస్ట్ చేత రైతు (Farmer) వేషాలు వేయించి ప్రత్యర్థి నేతలపై ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీపై వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్కిట్లు, మార్ఫింగ్ వీడియోలు, సోషల్ మీడియా ప్రచారాలతో రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికార పక్షం, తన అనుకూల సోషల్ మీడియా నెట్‌వర్క్‌పై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెనాలికి చెందిన గీతాంజలి(Geethanjali), చిన్నారి వేదికా రెడ్డి(Vedika Reddy), అలాగే బెండపూడి ప్రభుత్వ పాఠశాల (Bendapudi Government School) విద్యార్థులు(Students) సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యారనే ఘటనలను కూడా విమర్శకులు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థీకృతంగా డిజిటల్ ప్రచార యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ నిజంగా పారదర్శకంగా పనిచేయాలంటే, రాజకీయాలకు అతీతంగా ప్రతి వర్గంపై ఒకే విధమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవాలని, రావినూతల సునీల్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకిని చట్టపరమైన చర్యలకు దిగాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment