---Advertisement---

తల్లికి వందనంలో భారీ కోతలు? లక్షలాది విద్యార్థులు ఎందుకు అనర్హులయ్యారు?

July 16, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. ఇందుకోసం రూ.10,120.78 కోట్ల వ్యయానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈనెల 22 నాటికి నిధులు జమ చేస్తామని కూడా ప్రకటించింది.

అయితే ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఎలాంటి కటింగులు లేకుండా రూ.15,000 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పథకం అమలు చేయకపోగా, ఇప్పుడు రెండో ఏడాది కూడా భారీ పరిమితులు విధించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2024లో జగన్ ప్రభుత్వం ముగిసే సమయానికి రాష్ట్రంలో 87,41,885 మంది పాఠశాల విద్యార్థులు ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 84,37,049కు తగ్గిందని పేర్కొంటున్నారు. అంటే 3,04,836 మంది విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు ఈ లెక్కలు సూచిస్తున్నాయి. దీనికి తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలలో కోతలు కూడా ఒక కారణమా అనే చర్చ జరుగుతోంది.

ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం 67,47,190 మంది విద్యార్థులనే అర్హులుగా గుర్తించడంతో, సుమారు 16,89,859 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పథకానికి దూరమైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఒక్కో లబ్ధిదారునికి రూ.13,000 మాత్రమే అందించడం కూడా హామీకి విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వం మాత్రం అర్హత ప్రమాణాలనే సాకును చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఈ మొసపూరిత నిర్ణయం వల్ల లక్షలాది మంది విధ్యార్ధులు నష్టపోయాయని, విద్యార్థుల చదువులపై దీని ప్రభావం పడుతుందని విమర్శిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment