రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి మంత్రి పదవి (Minister Post) అంశంపై తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, హక్కు కోసం పోరాడటమే తెలుసని స్పష్టం చేశారు. గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు (By-Elections) వెళ్లినప్పుడు తన నియోజకవర్గానికి వంద మంది ఎమ్మెల్యేలు(MLA’s) ప్రచారానికి వచ్చారని గుర్తు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), తాను సోదరులమే అయినప్పటికీ ఒకే కుటుంబం (Same Family) కాదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబాలు వేరని చెబుతూ, మంత్రి పదవి విషయంలో వెంకట్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించారు. అధిష్ఠానం హామీ ఇచ్చిన పలువురికి మంత్రి పదవులు దక్కాయని, తనకు మాత్రం అవకాశం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి గతంలోనూ పలుమార్లు బహిరంగంగానే స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరితే మంత్రి పదవి ఇస్తామని హామీ (Promise) ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానాన్ని, ఢిల్లీ పెద్దలను (Delhi Leadership) కూడా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.
అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే కారణంతోనే రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో తాము ఒకే కుటుంబం కాదంటూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.






