గుంటూరులో(Guntur) ఓ మహిళను(Women) వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై టీడీపీ (TDP) నాయకుడు దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పే సంఘటనగా అభివర్ణించారు.
బుధవారం జరిగిన ఈ ఘటనను మూడు రోజుల పాటు దాచిపెట్టేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. చివరకు ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందన్నారు. ప్రజల ఆగ్రహం వ్యక్తమైన తర్వాత మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చర్యలు తీసుకుంటున్నట్లు హడావుడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
దాడి జరిగిన వెంటనే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేదే కాదన్నారు. వీడియోలను దాచిపెట్టడంపై దృష్టి పెట్టడం కంటే బాధితురాలికి వెంటనే న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు(Police Stations) ఉన్నది ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన అధికారులు, సమస్యను పంచాయితీతో ముగించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదేనా చంద్రబాబు చెప్పే మహిళా భద్రత (Women Protection) అని జగన్ ప్రశ్నించారు. మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ఇదేనా మీరు చెప్పే సుపరిపాలన అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2026
బుధవారం ఘటన జరిగితే.. మూడు…







