---Advertisement---

టీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే తెలంగాణలో ఉచిత వైద్యం, విద్య అమలు చేస్తాం: కల్వకుంట్ల కవిత!

July 19, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ రక్షణసేన పార్టీ (Telangana Rakshana Sena Party) అధినేత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం (Free Healthcare), విద్య (Free Education) అందిస్తామని ప్రకటించారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా, ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చును భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన చేసిన తర్వాత ఇతర పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్‌తో (State Budget) అలాంటి పథకాలు అమలు కావని, నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని తనను ప్రశ్నిస్తున్నారని కవిత చెప్పారు. అయితే నాయకులు అవినీతి (Leaders Corruption) ద్వారా సంపాదిస్తున్న సొమ్మును అరికడితే అదే బడ్జెట్‌తో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం, విద్య అందించడం సాధ్యమేనని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే లెక్కలతో సహా దీనిని నిరూపిస్తానని తెలిపారు.

తన తల్లి పట్టుదల వల్ల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివానని, అదే విద్య తనను అమెరికా వరకు తీసుకెళ్లిందని కవిత గుర్తుచేశారు. ప్రతి పేద కుటుంబానికి కూడా అలాంటి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్‌కు(TRS) ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్య వ్యవస్థను అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన పనులు సక్రమంగా చేసి ఉంటే కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చేదే కాదని కవిత వ్యాఖ్యానించారు. అవినీతి, అన్యాయాలను ప్రశ్నించినందుకే తనను బీఆర్ఎస్(BRS) నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల కోసం పోరాడిన కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment