ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కరోనా (COVID-19) మరోసారి టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో గురువారం 7 కొత్త కోవిడ్ కేసులు (COVID Cases) నమోదవడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజా కేసుల్లో గుంటూరు (Guntur) జిల్లాలో 4, తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో 2, బాపట్ల (Bapatla) జిల్లాలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 26కు చేరుకుంది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, జిల్లాల వారీగా చూస్తే కడప (Kadapa) జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 3 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4 మంది మృతి చెందారు. అయితే మృతులందరికీ కరోనా నిర్ధారణకు ముందే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ (Visakhapatnam) జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లను సందర్శించేందుకు వస్తుండటంతో ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చారు.
అదే సమయంలో విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు (Employees) తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






