---Advertisement---

తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ!

July 22, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమలలో(Tirumala) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలి ఘాట్ రోడ్డులోని (Ghat Road) 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం (Lord Hanuman Idol) మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని అపహరించడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాషాయ దుస్తులు (Saffron Clothes) ధరించిన ఓ వ్యక్తి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. విగ్రహాన్ని కాషాయ వస్త్రంలో చుట్టి, ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్లినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా నమోదైంది.

పవిత్ర తిరుమల క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం భక్తులను కలవరానికి గురి చేస్తోంది. విగ్రహం కనిపించకపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు (Devotees) అక్కడే బొట్టు పెట్టుకుని, దండం పెట్టుకుని ప్రార్థనలు చేసి వెనుదిరుగుతున్నారు. ఈ ఘటనతో ఆలయ భద్రతపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో కనిపించిన వ్యక్తి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టగా, విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment