పొగాకు ధరల (Tobacco Prices) పతనంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతుల సమస్యలను (Farmers Problems) స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) వచ్చే 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) పర్యటించనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలో రైతులతో సమావేశమైన ఆయన, గోపాలపురం (Gopalapuram) లేదా జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) రైతులను(Farmers) ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తానన్నారు.
పొగాకు వేలం(Tobacco Auction) ప్రారంభమై 94 రోజులు గడిచినా కేవలం 16.5% పంట మాత్రమే కొనుగోలు చేశారని. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోలు పండగా, ఇప్పటివరకు 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు అయ్యాయని. చంద్రబాబు(Chandrababu) రూ.200 కంటే తక్కువ ధర ఉండకూడదని చెప్పిన మరుసటి రోజే ధరలు భారీగా పడిపోయాయని ఆరోపించారు.
గోపాలపురంలో ధర రూ.130, జంగారెడ్డిగూడెంలో రూ.170 వరకు పడిపోయిందన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
మార్క్‌ఫెడ్‌ను (Markfed) కొనుగోళ్లలోకి తీసుకురావాలని, ప్రభుత్వం రైతుల తరఫున నిలబడుతోందనే సంకేతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ.3,000 కోట్లు, రైతుల తరఫున కొనుగోళ్లకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే కందుకూరులో మరో పర్యటన చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలను ఉద్యమంగా మారుస్తామని జగన్ హెచ్చరించారు. “రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.






