నీట్(NEET), డీఎస్సీ (DSC) పేపర్ లీకేజీల (Paper Leakages) వ్యవహారంపై వైసీపీ(YSRCP) నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Ketireddy Venkatarami Reddy) తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నా.. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మాత్రం అలాంటి స్పందన కనిపించకపోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో (Students Future) ముడిపడి ఉన్న ఇలాంటి కీలక అంశాలపై సమాజం మౌనం వీడాల్సిన అవసరం ఉందన్నారు.
సినిమా బెనిఫిట్ షోలు (Benefit Shows) వస్తే యువత, ప్రజలు భారీగా స్పందిస్తారని.. కానీ వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే నీట్, డీఎస్సీ పేపర్ లీకేజీల వంటి ఘటనలపై అదే స్థాయిలో స్పందన ఎందుకు కనిపించడం లేదని కేతిరెడ్డి ప్రశ్నించారు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు మారిపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని కేతిరెడ్డి (Ketireddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడం సరైన విధానం కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో స్పందించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
బాధ్యత తీసుకుని ప్రశ్నించాల్సిన వర్గాలే మౌనంగా ఉంటే.. సాధారణ ప్రజలు ఎలా ముందుకు వచ్చి న్యాయం కోసం గొంతెత్తుతారని ఆయన నిలదీశారు. సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అందరూ స్పందించాలని, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.






