ఐదు గంటల 30 నిమిషాల సమయంలో హైదరాబాద్‌లోని (Hyderabad) డీజీపీ కార్యాలయంలో(DGP Office) విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి (Constable Swamy) కార్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లి తన సర్వీస్ తుపాకితో (Service Gun) కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాల్పుల శబ్దం విన్న సహచర పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు గుర్తించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ ఒక సూసైడ్ నోట్‌ను (Suicide Note) స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, వారు ఎంతో మంచివారని స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను చనిపోయిన తర్వాత కూడా దయ్యంగా మారినా తన భార్య, పిల్లలను కాపాడుతానంటూ భావోద్వేగంగా రాయడం అందరినీ కలచివేసింది.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే డీజీపీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య వెనుక వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ నోట్‌ను (Suicide Note) కీలక ఆధారంగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.






