---Advertisement---

“రాజ్యమా ఉలిక్కిపడు”.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు!

July 24, 2026

Summarize with AI

---Advertisement---

విద్యార్థుల హక్కుల (Students Rights) కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలకు మద్దతుగా హైదరాబాద్‌లోని (Hyderabad) ఇందిరా పార్క్ (Indira Park) వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. నీట్ పరీక్షల్లో (NEET Examinations) జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు (Question Papers Leaks), ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ ఆయన నిరసనలో పాల్గొని విద్యార్థులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా “ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా (Resignation) చేయాలి.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి” అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమం రాజకీయాల కోసం కాదని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని, వారి వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదన్నారు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థుల ఆవేదన చూసిన తర్వాత వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రజా ఉద్యమాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ గౌరవం ఇస్తుందని, విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని కేటీఆర్ అన్నారు. విద్యార్థులపై(Students) జరిగిన పోలీసు దాడులు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని, న్యాయం కోరిన యువతపై ఇలాంటి చర్యలు అమానుషమని మండిపడ్డారు. “పిల్లలు ప్రధాని పదవి అడగలేదు.. వారికి కావాల్సింది న్యాయం మాత్రమే” అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేపట్టిన నిరాహార దీక్షను ప్రస్తావిస్తూ, తెలంగాణ సాధన కోసం కేసీఆర్(KCR) చేసిన దీక్ష తరహాలోనే ఆయన కూడా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై (Central Government) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, “మేకిన్ ఇండియా (Make in India) అని చెప్పి.. లీకిన్ ఇండియా (Leak in India) చూపిస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. గత 25 రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు, యువత రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారికి బదులుగా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పోలీసులతో(Police) అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. అందుకే విద్యార్థులకు అండగా నిలవడానికి ఈ నిరసన చేపట్టామని వెల్లడించారు.

ఢిల్లీ (Delhi) ఘటనలను అత్యంత అమానుషంగా అభివర్ణించిన కేటీఆర్, మీడియా సహకారం లేకపోయినా యువత(Youth) ఒంటరిగా వీధుల్లో పోరాడుతోందని అన్నారు. “ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ (Prime Minister Modi) పెట్టుకున్నారు. రాజ్యమా ఉలిక్కిపడు.. ఈ తరం చావుకు భయపడే తరం కాదు. ఐటీ, ఈడీ దాడులకు భయపడే తరం కూడా కాదు” అంటూ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. యువత ఆవేదనను తక్కువ అంచనా వేయొద్దని, వారి న్యాయ పోరాటానికి దేశమంతా మద్దతు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment