తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో (Murder Case) నాంపల్లిలోని (Nampally) ప్రత్యేక సీబీఐ కోర్టు (CBI Court) కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపించాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత (Narreddy Sunitha) దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
వివేకా హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికితీయాలంటే ఇంకా సమగ్ర దర్యాప్తు అవసరమని, పలువురు అనుమానితులను విచారించాల్సి ఉందని సునీత తన పిటిషన్‌లో (Petition) పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదని వాదిస్తూ, తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
అయితే విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఆదేశిస్తే మాత్రమే తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు, ఇప్పటికే దర్యాప్తు పూర్తై ఛార్జ్‌షీట్ (Charge Sheet) దాఖలైన నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరం లేదని భావించి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ (Petition Dismiss) చేసింది.
అయితే ఈ పరిణామం తర్వాత రాష్ట్రంలో పలు వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు విచారణ (ట్రయల్) ముందుకు సాగాల్సిన సమయంలో వరుసగా తదుపరి దర్యాప్తు పిటిషన్లు దాఖలు చేయడం వల్ల ట్రయల్ ఆలస్యమవుతోందని. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.







