ప్రజాస్వామ్యంలో (Democracy) నిరసన హక్కులపై జరుగుతున్న చర్చల మధ్య జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. విశాఖ ఉక్కు కార్మికులపై (Visakha Steel Workers) చేసిన ఆరోపణల నుంచి ప్రొఫెసర్ డా. నాగేశ్వర్‌రావు(Dr. Nageshwar Rao), తాజాగా ఢిల్లీలో (Delhi) నిరసనకు దిగిన విద్యార్థులపై(Students) చేసిన వ్యాఖ్యల వరకు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలను బలహీనపరిచేలా, నిరసన వ్యక్తం చేసే వర్గాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమ (Visakha Steel Privatization Movement) సమయంలో కొందరు ట్రేడ్ యూనియన్ (Trade Union) నాయకులు ప్లాట్ల కోసం రాజీ పడ్డారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాలు (Workers Unions) ఖండించాయి. ఆధారాలు ఉంటే వెల్లడించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికీ ఆధారాలు చూపలేదని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి తప్పుడు భాష్యాలు చెబుతూ, వారిని విచ్ఛిన్న శక్తులనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం తప్పని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో కమ్యూనిజంపై (Communism) పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన రెండు నాలుకల ధోరణిని బయటపెట్టాయని విమర్శకులు అంటున్నారు. గతంలో కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రస్తావించిన పవన్, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ధోరణి చూస్తుంటే ప్రజా ఉద్యమాలపై బురద జల్లుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఫాసిస్టు భావజాలానికి పునాదులు వేస్తున్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొఫెసర్ డా. నాగేశ్వర్‌రావుతో (Dr. Nageshwar Rao) వివాదం, కార్మికులపై నిందలు, విద్యార్థి ఉద్యమాలపై తప్పుడు భాష్యాలు—ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో ఎంత ప్రమాదకరమైన ధోరణితో ముందుకు వెళుతున్నారో సూచిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. ప్రజాస్వామ్య పాలనలో ఆయనలాంటి భావజాలం చెల్లదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని, తగిన సమయంలో అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్‌కు ఓటు రూపంలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.







