---Advertisement---

చంద్రబాబు తీరుతో బోండా ఉమా అసహనం? టీడీపీలో కాపు నేతల అసంతృప్తి పెరుగుతోందా?

July 27, 2026

Summarize with AI

---Advertisement---

టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీలో కీలక చర్చకు దారితీసింది. దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంస్మరణ సభలో (Memorial Meeting) వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత అంబటి రాంబాబుతో (Ambati Rambabu) కలిసి వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao), మంత్రి నిమ్మల రామానాయుడుకు (Nimmala Rama Naidu) బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బోండా ఉమా, అంబటి రాంబాబు పరస్పరం పలకరించుకోవడం, ఆలింగనం (Hug) చేసుకోవడం, అలాగే ఆ సభలో బోండా ఉమా “ముద్రగడ పద్మనాభం కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ(TDP) ఓడిపోయింది” అని వ్యాఖ్యానించడం తెలుగుదేశం అధినేతకు మింగుడుపడలేదని సమాచారం. దీంతో విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని పార్టీ అధిష్టానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి బోండా ఉమాను కార్నర్ చేసిందని పలువురు చెబుతున్నారు.

అయితే, చంద్రబాబు తీరుపై బోండా ఉమా (Bonda Uma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను వైఎస్సార్‌సీపీ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లలేదని, జనసేన(Jana Sena) మాజీ నేత దాసరి రాము (Dasari Ramu) నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభకు మాత్రమే హాజరయ్యానని ఆయన చెబుతున్నట్లు సమాచారం. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగానే పలకరించానని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే బోండా ఉమా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా (Jakkampudi Raja) నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ(Jyothula Nehru), వంగవీటి రాధ (Vangaveeti Radha) హాజరైన విషయాన్ని గుర్తుచేస్తూ, వారిని కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు టీడీపీలోని కాపు నేతల్లో (Kapu Leaders) అసంతృప్తికి దారితీస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన దివంగత నేత సంస్మరణ సభకు హాజరుకావడాన్ని కూడా తప్పుగా చూడటంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరణించిన నాయకుడికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గతంలో వంగవీటి రాధ తన తండ్రి వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజాతో (Dadisetti Raja) కలిసి కనిపించిన సందర్భంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, ఇప్పుడు బోండా ఉమా విషయంలో మాత్రం వివరణ కోరడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాల నేతలు కలుసుకునే స్వేచ్ఛ కూడా టీడీపీలో(TDP) లేదా అంటూ కొన్ని కాపు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోండా ఉమా ఇచ్చే వివరణపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment