హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనంగా మారిన హైడ్రా (HYDRA) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు (A.V. Ranganath) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) భారీ షాక్ ఇచ్చింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ (HYDRA Commissioner) పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాకుండా, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఈ వ్యవహారం సికింద్రాబాద్ (Secunderabad) సమీపంలోని లోతుకుంట (Lothukunta) సర్వే నంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూములకు(Lands) సంబంధించిన వివాదంతో ముడిపడి ఉంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ (Shanta Sriram Constructions) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగానే హైడ్రా అధికారులు భూముల్లో జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ చేసిన ఆరోపణలను పరిశీలించింది.
విచారణ సందర్భంగా ఒకే అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన న్యాయస్థానం, అధికారుల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నవారే వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ రంగనాథ్ అఫిడవిట్ (Affidavit) సమర్పిస్తూ కోర్టుకు క్షమాపణలు (Apologies) తెలిపారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంటూ, లోతుకుంటలోని 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు ప్రవేశించలేదని వివరణ ఇచ్చారు. పిటిషనర్ కోర్టుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చారని కూడా తన అఫిడవిట్లో తెలిపారు.
అయితే ఈ వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం, రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల (Responsibilities) నుంచి వెంటనే తొలగించాలని (Remove) రాష్ట్ర ప్రభుత్వాన్ని (State Government ఆదేశించింది. ఈ తీర్పు రాష్ట్ర పరిపాలనలోనే కాకుండా హైడ్రా వ్యవహారంలోనూ కీలక మలుపుగా మారింది.






