వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) డిఫాక్టో సీఎం నారా లోకేష్‌పై (Nara Lokesh) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, చర్చలకు సవాళ్లు విసరడం కంటే ముందు వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలని అన్నారు. చంద్రబాబు(Chandrababu) చర్చకు వస్తే వైఎస్ జగన్(YS Jagan) వస్తారని, లోకేష్ చర్చకు వస్తే తాను సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
లోకేష్ విద్యాశాఖ (Education Department) మినహా దాదాపు అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. కంపెనీలు (Companies) తీసుకొచ్చానని, ఉద్యోగాలు (Jobs) కల్పించానని, రెడ్‌బుక్ (Red Book) రుచి చూపిస్తానని, చిన్న విషయం జరిగినా తన ఘనతగా చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడం కోసం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యేగా(First Time MLA) గెలిచిన లోకేష్‌కు(Lokesh) నిజంగా సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాలపై (DSC Irregularities) తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు నీతి మాటలు చెబుతున్నారని విమర్శించారు.
డీఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని పేర్ని నాని ఆరోపించారు. పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో (Jobs Recruitment) తప్పులు జరిగాయని, వాటిని దాచిపెట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. జిల్లా కలెక్టరేట్లలో మెరిట్ జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. అర్హులైన వారికి కాకుండా ఇతరులకు పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలపై (Sports Quota Recruitments) కోర్టు విచారణ జరపాలని సూచించిందని గుర్తుచేసిన పేర్ని నాని, ప్రభుత్వం నిజాయితీగా ఉంటే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా నైతిక విలువలు ఉన్నాయంటే బాధ్యులు రాజీనామా చేయాలని అన్నారు. మంత్రి పదవి కోసం బోండా ఉమా (Bonda Uma) ఎదురుచూస్తున్నారని, అలాంటప్పుడు బాధ్యులు రాజీనామా చేసి ఆయనకు అవకాశం ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.







