---Advertisement---

డీఎస్సీ స్కాంపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఎందుకు చెప్పలేదు? యువతలో పెరుగుతున్న సందేహాలు!

July 28, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ-2025(DSC-2025) నియామక ప్రక్రియలో (Recruitment Process) అక్రమాలపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రశ్నాపత్రం లీక్(Question Paper Leak), స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు(Sports Quota Irregularities), మెరిట్ జాబితాల గోప్యత(Merit Lists Confidentiality), ఉద్యోగాల విక్రయం (Jobs Sale) వంటి అంశాలపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

అయితే, ఈ ఆరోపణలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పదేపదే “చర్చకు రావాలి”, “నాతో నేరుగా మాట్లాడాలి” అనే వ్యాఖ్యలు చేయడం ద్వారా అసలు ప్రశ్నలను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విమర్శకుల అభిప్రాయం ప్రకారం, నిజంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఉంటే, జగన్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని ఆధారాలతో ఖండించే అవకాశం ఉందని. అలా చేయకుండా రాజకీయ సవాళ్లకే పరిమితం కావడం వల్ల యువతలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు.

జగన్ లేవనెత్తిన ప్రధాన ఆరోపణలు చూస్తే:-

1. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను వేర్వేరుగా ఉంచకుండా ఒకే అధికారికి (Officer) అప్పగించడం. అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రశ్నపత్రం తయారీ, అప్‌లోడింగ్ ప్రక్రియను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) చేతుల్లో ఎందుకు పెట్టారు? పరీక్షల నిర్వహణలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి అత్యున్నత ర్యాంకు ఎలా వచ్చింది?

2. పాత నిబంధనలను (జీవో నెం. 74) రద్దు చేసి, కొత్తగా జీవో నెం.4, జీవో నెం. 47లను తీసుకొచ్చారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే, కనీస విద్యార్హత లేకుండానే నియామకాలకు అవకాశం కల్పించడం. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల (Participation Certificates) ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం. నియామకాలు పూర్తయ్యాక సంబంధిత జీవోలను మళ్లీ రద్దు చేయడం. ఈ ప్రక్రియ ఎవరికి లబ్ది చేయడానికి చేపట్టారు?

3. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కట్-ఆఫ్ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో (Public Domain) ఉంచకపోవడం. ఎంపికైన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపడంలో మతలబు ఎంటి? ఒక్కో ఉపాధ్యాయ పోస్టుకు ₹15 లక్షల నుంచి ₹20 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాలకు సంబంధించినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో, వీడియో క్లిప్పులకి సమాధానం ఏది?

4. జాతీయ స్థాయి క్రీడల్లో మెడల్ సాదించిన విజేతలకు అవకాశం ఇవ్వకుండా, కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? అందులోనూ అభ్యర్థులు సమర్పించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లలో అధిక శాతం అధికార పార్టీకి (Ruling Party) అనుకూలంగా ఉన్న వీసీల (VCs) ద్వారానే జారీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే సమాధానాలు ఎందుకు చెప్పారు?

ఈ విధంగా డీఎస్సీ-2025 వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షం సాక్ష్యాలతో పలు ప్రశ్నలు లేవనెత్తగా, వాటికి ప్రభుత్వం అధికారికంగా, ఆధారాలతో కూడిన సమాధానం ఇవ్వకుండా అర్ధం పర్ధం లేని సవాళ్ళు చేస్తూ నాతో నేరుగా చర్చకిరా అంటూ మాట్లాడటం స్కాం ఆరోపణల నుండి తప్పించుకునే ప్రక్రియలాగానే కనిపిస్తుందని యువత అభిప్రాయ పడుతుంది ఈ విషయం యువతతో పాటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని అభ్యర్థులు, పలువురు సామాజిక వర్గాలు కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment