---Advertisement---

ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలపై రేవంత్ రెడ్డి కామెంట్స్.. ఇరుకున పడ్డ నారా లోకేష్?

July 28, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చకు తెరలేపాయి. ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆయన ముందు ఏపీలో కూటమి ప్రభుత్వం విడుదల చేయకుండా వేల కొట్ల రూపాయలు పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలను విద్యార్థులకు(Students) చెల్లించాలని సూచించారు.

ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ చదువుతున్న 11 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10,700 కోట్ల బకాయలు పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా అక్కడ సమస్యను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వంపై (Telangana Government) విమర్శలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగ పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పథకాన్ని అమలు చేసే ఉన్నత విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ శాఖకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుపై విమర్శలకు బలం చేకూర్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకుండా విమర్శలను కొట్టిపారేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) అంశాన్ని ప్రస్తావించడంతో, దీనిపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Rayalaseema Lift Irrigation Scheme) విషయంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం గుర్తు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నిలిపివేతలో తన పాత్ర ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని (Andhra Pradesh Government) లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పరిపాలనపై కొత్త చర్చకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మొత్తంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, పరిపాలన పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment