---Advertisement---

చంద్రబాబుకు షాక్ – రాజధాని రైతుల భూములు లాక్కోవద్దంటూ స్టేటస్-కో ఉత్తర్వులు

July 31, 2026

Summarize with AI

---Advertisement---

అమరావతి రాజధాని (Amaravati Capital) పరిధిలోని పెనుమాక గ్రామంలో సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) నిర్మాణం కోసం భూముల స్వాధీనంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించకుండా ఏ వ్యక్తి ఆస్తినైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. భూమి విస్తీర్ణం ఎంత చిన్నదైనా రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు వర్తిస్తుందని పేర్కొంది.

2013 భూ సేకరణ (Land Acquisition), పునరావాసం మరియు పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం (Fair Compensation), పారదర్శకత హక్కు చట్టం (Transparency Right Act) ప్రకారం ప్రభుత్వం భూములను సేకరించే అధికారం కలిగి ఉన్నప్పటికీ, ఆ చట్టంలో పేర్కొన్న ప్రతి విధివిధానాన్ని తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం అధికారం ఉండటం మాత్రమే కాకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తిగా అనుసరించాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

భూ సేకరణ సమయంలో చట్టపరమైన నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ వాదనలను ఈ దశలో తోసిపుచ్చలేమని కోర్టు పేర్కొంది. ఆ అంశాలను ప్రధాన రిట్ పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. అప్పటి వరకు పెనుమాక రైతు చోడిశెట్టి నిర్మలకు (Chodishetty Nirmala) చెందిన భూమిపై గతంలో జారీ చేసిన యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులను కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

అంతేకాకుండా, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన అనంతరం, మధ్యంతర పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని హైకోర్టు ఆదేశించింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి (Tadepalli) మండలం పెనుమాక గ్రామంలోని సర్వే నంబర్ 39/2లో ఉన్న 65 సెంట్ల భూమిని సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం స్వాధీనం చేసుకునే ప్రక్రియను సవాలు చేస్తూ చోడిశెట్టి నిర్మల హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వానికి షాక్ తగిలింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment